- Advertisement -
పార్లమెంటు సభ్యుల(ఎంపీల) జీతభత్యాలను కేంద్రం పెంచింది. 2023 ఏప్రిల్ 1 ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఎంపీల జీతాన్ని 24 శాతం పెంచుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటన జారీ చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటనను విడుదలచేసింది. దీంతో ఒక్కో ఎంపీ వేతనం నెలకు రూ. లక్ష నుంచి రూ. 1.24 లక్షలకు పెరుగనున్నది. ఇక రోజువారీ భత్యాన్ని రూ. 2000 నుంచి రూ. 2500కు పెంచినట్లు నోటిఫికేషన్ పేర్కొంది. కాగా ఎంపీలకు ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ.25వేల పింఛనును రూ.31వేలకు పెంచుతున్నట్లు కూడా వెల్లడించింది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న వ్యయ ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, పింఛను చట్టం కింద మంజూరు చేయబడిన అధికారాలను ఉపయోగించి ఈ జీతభత్యాల పెంపు ప్రకటన చేశారు.
- Advertisement -