Monday, December 23, 2024

తేజస్వియాదవ్‌పై ‘మాంత్రికురాలి వేట’

- Advertisement -
- Advertisement -

పాట్నా : ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌కు సంబంధించి బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వియాదవ్, మరి కొందరిపైనా సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని జేడి( యు) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ మంగళవారం తీవ్రంగా ఆక్షేపించారు. ఆర్‌జేడీ నేతకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం మాంత్రికురాలి వేటను సాగిస్తోందని ధ్వజమెత్తారు. “ఈ కేసులో సిబిఐ ఎలాంటి సాక్షాధారాలు లేకుండా రెండో ఛార్జిషీట్ దాఖలు చేసింది.

ఇంతకు ముందు ఎలాంటి రుజువు లేదని చెప్పింది. ఎప్పుడైతే ఆర్‌జేడీ, జేడీ(యు), మిగతా విపక్షాలు బీహార్‌లో 2022 లో మహా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయో, అప్పుడు కేంద్రం తన పెంపుడు చిలుక ( సిబిఐ) ను ఉపయోగించడం ప్రారంభించింది. అలాగే ఇతర దర్యాప్తు సంస్థలను డిప్యూటీ సిఎంకు వ్యతిరేకంగా రంగం లోకి దింపింది. ” అని రంజన్ సింగ్ ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో తేజస్వియాదవ్, ఆయన తల్లిదండ్రులు మాజీ సిఎం రబ్రీదేవి, మాజీ కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లకు వ్యతిరేకంగా సిబిఐ సోమవారం న్యూఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ రెండో ఛార్జిషీట్‌లో మరో 14 మంది పేర్లు ఉన్నాయి.

ఈ కేసులో నిందితుల పాత్రపై దర్యాప్తు పూర్తి కాకుండానే ప్రాథమిక నివేదిక సమర్పించడమైందని, అందుకనే రెండో ఛార్జిషీట్ దాఖలు చేశామని సిబిఐ అధికార వర్గాలు చెబుతున్నాయి. “ ఎవరైతే బీజేపీకి వ్యతిరేకమౌతారో అప్పుడు సిబిఐ ప్రవేశిస్తుందని మనందరికీ తెలుసు. పాట్నాలో జూన్ 23న విపక్షాల సమావేశం జరిగిన తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకులంతా దాదాపు రూ. 70 వేల కోట్ల అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారని, ప్రధాని మోడీ బహిరంగ సభలో వెల్లడించారు.

ఐదు రోజుల తరువాత ఎన్‌సిపి నేతలు బీజేపీ నేతృత్వ మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగమయ్యేసరికి మోడీ అంతా సవ్యంగా కనిపించింది. ఎన్‌సిపి నేతల అవినీతి ప్రస్తావన సమయానుకూలంగా మోడీ మర్చిపోయారు.” అని సింగ్ చేశారు. “ ఈ విధమైన రాజకీయ మాంత్రిక వేట విపక్ష కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తుంది. సిబిఐ చర్యకు కానీ, లేదా బీజేపీ నేతృత్వ కేంద్ర ప్రభుత్వానికి కానీ యాదవ్ ఎప్పుడూ భయపడరు. ఈ అప్రజాస్వామిక మోడీ ప్రభుత్వ చర్యలను ఓటర్లు అర్ధం చేసుకుంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో దీనికి సరైన గుణపాఠం చెబుతారు ”అని రంజన్ సింగ్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News