Monday, December 23, 2024

కొయంబత్తూర్ కారు పేలుడు దర్యాప్తు ఇక ఎన్ఐఏ కి…

- Advertisement -
- Advertisement -

NIA Coimbatore

న్యూఢిల్లీ: కొయంబత్తూర్‌లో అక్టోబర్ 23న కారులో ఎల్‌పిజి సిలిండర్ పేలిన ఘటన దర్యాప్తు ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం గురువారం జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని తమిళనాడు ప్రభుత్వం కోరిన తర్వాత హోం మంత్రిత్వ శాఖ వెంటనే కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ ర్యాడికలైజేషన్(సిటిసిఆర్) విభాగానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును ఇక ఎన్‌ఐఏ తీసుకుంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సమావేశం తర్వాత ఈ మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు తమిళనాడు పోలీసులు ఈ కేసులో ఆరుగురిని చట్ల వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యుఎపిఎ) కింద అరెస్టు చేశారు. మారుతి 800 కారులో ఎల్‌పిజి సిలిండర్ పేలి అనుమానస్పద స్థితిలో జమీషా ముబిన్ చనిపోయాడు. అతడు అక్టోబర్ 23న ఉదయం 4 గంటలకు కొయంబత్తూరులో గుడి వద్ద కారు నడుపుతున్నప్పుడు అది పేలింది. ముబిన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. ఇదివరలో అతడిని 2019లో కూడా ఎన్‌ఐఏ ఉగ్రవాద సంబంధాల కింద ప్రశ్నించింది. ఇక సోమవారం రాత్రి అరెస్టయిన ఐదుగురు ముహమ్మద్ తల్కా(25), ముహమ్మద్ అసరుద్దీన్(25), ముహమ్మద్ రియాజ్(27), ఫిరోజ్ ఇస్మాయిల్(27), ముహమ్మద్ నవాజ్ ఇస్మాయిల్(27), కాగా గురువారం అరెస్టయిన ఆరోవ్యక్తిని అఫ్సర్ ఖాన్‌గా గుర్తించారు. అతడు కారు పేలుడులో చనిపోయిన ముబిన్ బంధువని తెలుస్తోంది. ముబిన్ ఇంట్లో పేలుడుకు సంబంధించిన 75 కిలోల మందుగుండు సామాగ్రి లభించినట్లు డిజిపి తామరై కన్నన్ తెలిపారు. డిజిపి శైలేంద్ర బాబు కూడా దర్యాప్తులో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News