- Advertisement -
న్యూఢిల్లీ: మనీశ్ సిసోడియాకు లుక్‌ఔట్ నోటీసులు జారీ కావడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. పొద్దుపొద్దున్నే సిబిఐ ఈడీ ఆట మొదలైందని ట్వీట్‌లో విరుచుకుపడ్డారు. యావద్దేశంతో జరుపుతున్న పోరాటమిదని, కేంద్రం ప్రతి ఉదయం లేవగానే సిబిఐ-ఈడీ గేమ్ మొదలవుతుందని వ్యాఖ్యానించారు. సామాన్య ప్రజానీకం ద్రవ్యోల్బణంతో పోరాడుతోంది. యువత నిరుద్యోగంతో అల్లాడిపోతోంది. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం పని చేయకుండా యావద్దేశంతోప్రభుత్వం పోరాడుతోందని కేజ్రీవాల్ ఘాటుగా విమర్శించారు. ఇలాగైతే దేశం ఏం ప్రగతి సాధిస్తుందని ప్రశ్నించారు.
- Advertisement -