Wednesday, January 22, 2025

బ్యాంక్ ఉద్యోగులకు త్వరలో శుభవార్త

- Advertisement -
- Advertisement -

వారంలో ఐదు రోజుల పని డిమాండ్‌కు సుముఖంగా కేంద్రం
త్వరలో అధికారిక నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంక్ ఉద్యోగులు త్వరలో శుభవార్త విననున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐదు రోజుల వర్క్ వీక్(పనివారం) డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చేందుకు సి ద్ధమవుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయవచ్చని పలు మీడియా సంస్థలు పే ర్కొన్నాయి. బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 పని దినాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొంది. బ్యాంకు ఉ ద్యోగుల పాత డిమాండ్‌కు ముహూర్తం ఖరారు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసి, కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురావచ్చు. ఇదే జరిగితే ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు వారంలో 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత విధానంలో బ్యాం కు ఉద్యోగులకు నెలలో ప్రతి ఆదివారం సెలవు ఉండగా, ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు మాత్రం లేదు. ప్రతి నెలా మొదటి, మూడో, ఐదో శనివారాలు బ్యాంకులు తెరిచి ఉంటాయి. అయితే నెలలో రెండో, నాలుగో శనివారాలు బ్యాంకు ఉద్యోగులకు సెలవులు ఉంటాయి.

ఐబిఎ ప్రతిపాదన
వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని బ్యాంకుల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేష న్ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ముందుకు సాగుతుందని, వేజ్ బోర్డు సవరణ తో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని తెలుస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత మొద ట ఐదు పనిదినాల డిమాండ్ వచ్చింది. అయితే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. బదులుగా 19 శాతం వే తన పెంపును ఇచ్చింది. తర్వాత ఐదు రోజుల పని అంశానికి డిమాండ్ పెరిగింది. ఈ డిమాం డ్ కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూ నియన్స్ నేతృత్వంలో ఈ ఏడాది జనవరిలో బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు స మ్మె కూడా చేశారు.

పెరగనున్న పని గంటలు
వారానికి 5 రోజుల పని తర్వాత పని గంటలను పెంచాలనే డిమాండ్‌కు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అంగీకరించింది. వారానికి 5 రోజుల డిమాండ్‌ను పరిశీలిస్తామని ఫిబ్రవరిలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించింది. దీంతో ప్రతిరోజు 40 నిమిషాల పనివేళలు పెంచాలనే షరతు చేర్చారు. ఇదే జరిగితే బ్యాంకు ఉద్యోగులు ఉదయం 09:45 నుంచి సాయంత్రం 05:30 వరకు పని చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News