Saturday, December 21, 2024

పిఎం కిసాన్ యోజన పరిధిలో 12 కోట్ల మంది రైతులకు సాయం

- Advertisement -
- Advertisement -

రైతులు దేశానికి అన్నదాతలు, వీరికి ప్రతి ఏటా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పరిధిలో వారి చేతికే అందేలా ఆర్థిక సాయం అందుతోందని ఆర్థిక మంత్రి తెలిపారు. 11.8 కోట్ల మంది అన్నదాతల కుటుంబాలకు ఈ పథకం పరిధిలో సాయం అందిస్తున్నారు. వీరిలో మధ్యస్థ, సన్నకారు రైతులు ఉన్నారు. పిఎం ఫసల్ బీమా యోజన పరిధిలో 4 కోట్ల మంది రైతులకు పంట బీమా అందుతోంది. ఇతర పథకాల ద్వారా కూడా దేశంలోని రైతులకు తగు సాయం కల్పిస్తున్నామని, దళారీల పాత్ర లేకుండా అన్నదాతల ఖాతాలలోకి నేరుగా డబ్బులు అందేలా చేయడమే ఆలోచన అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతు కేంద్రీకృత పాలసీలను పాటిస్తోంది.

సమ్మిశ్రిత, సమతూక, ఇతోధిక వృద్ధి , ఉత్పాదన కీలకంగా వ్యవసాయ రంగం వృద్థికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం రెండింతలు అంతకు మించి చేయడం కీలకం, వారికి ఆర్థిక ఆదాయ వృద్ధి అవసరం. కాగా అత్యవసర పరిస్థితుల నుంచి రక్షించడం అవసరం అని, ఈరిస్క్ నివారణ చర్యల్లో భాగంగానే దిగుబడి ధరలు, బీమా ఏర్పాట్లు, సాంకేతిక పరిజ్ఞానం వాడకం, స్టార్టప్‌ల ద్వారా సృజనాత్మకత విధానాలను ప్రవేశపెట్డం జరుగుతోందని వివరించారు.

పిఎం కిసాన్ సంపద యోజనతో 38 లక్షల రైతులకు మేలు
ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన పరిధిలో ఇప్పటికే 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 10 లక్షల మందికి ఉపాధి దక్కిందని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు. కాగా ప్రధాన మంత్రి ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ యోజన పరిధిలో 2.4 లక్షల స్వయం సహాయక బృందాలకు, 60 మంది వ్యక్తులకు సాయం అందింది. నూర్పిళ్ల తరువాత పంట నష్టాల నివారణకు , దిగుబడి పెంపుదల, ఆదాయం వృద్థికి చర్యలు వేగిరపర్చినట్లు తెలిపారు.
*ప్రధాన మంత్రి మత్స సంపద యోజన పిఎంఎంఎస్‌వై పరిధిలో రూ 1 లక్ష కోట్ల అక్వాసంపద ఉత్పత్తి

* ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్( ఇ నామ్) మండలలకు అనుసంధానం. 1.8 కోట్ల మంది రైతులకు సేవలు. రూ 3 లక్షల కోట్ల మేర వ్యాపార లావాదేవీలు
*త్వరలోనే సమగ్రరీతిలో పాడిపరిశ్రమ అభివృద్ధి పథకం. రాష్ట్రీయ గోకుల్ మిషన్, జాతీయ దాణా పథకం, మౌలిక వసతుల వృద్ధి ద్వారా పాడి, పశు సంరక్షణ రంగానికి ఇతోధిక సాయం
* ప్రత్యేక మత్సశాఖ ఏర్పాటు ద్వారా దేశీయ స్థాయిలో ఆక్వాకల్చర్ రంగంలో ఉత్పత్తి సామర్థం పెరిగింది. సీఫుడ్ ఎగుమతులు గత పది సంవత్సరాలలోరెండింతలు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News