న్యూఢిల్లీ: రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు సాగు చట్టాల అంశాన్ని ప్రస్తావించాయి. చర్చలతోనే సమస్యలను పరిష్కరించాలని కోరాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘రైతులతో మాట్లాడడానికి కేంద్రం ఎప్పడూ సిద్ధంగా ఉంటుంది. రైతులకు కేంద్రం ఇచ్చిన ఆఫర్ ఇప్పటికీ వర్తిస్తుంది. ఏడాదిపాటు కొత్తసాగు చట్టాల అమలు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతుల అభ్యంతరాలను పరిశీలిస్తాం. రైతుల సమస్యలకు చర్చలతోనే పరిష్కారం లభిస్తుంది. రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. బడ్జెట్ లో రైతులకు వరాలు ప్రకటిస్తాం. పార్లమెంట్ సమావేశాలను విపక్షాలు సద్వినియోగం చేసుకోవాలి. అన్ని అంశాలపై పార్లమెంట్ లో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’ అని ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Centre Ready to talk with farmers over farm laws: PM Modi