Sunday, December 22, 2024

రక్షాబంధన్ కు మోడీ గిఫ్ట్…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వంటగ్యాస్ ధరలను తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాగ్దానాన్ని తిప్పికొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఉజ్వల వినియోగదారులకు గ్యాస్ ధర రూ.400 తగ్గించింది. రక్షా బంధన్ సందర్భంగా మహిళలలకు ప్రధాని కానుకగా ఇచ్చారని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఉజ్వల కింద ఉచితంగా 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చామన్నారు. 33 కోట్ల గ్యాస్ వినియోగదారులకు లబ్ది చేకూరనుందని అనురాగ్ వెల్లడించారు. ప్రస్తుతం 14.2 కేజీల ఎల్‌పిజి సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ.1103 ఉంది. బుధవారం నుంచి ఇది రూ. 903 ఉండనున్నది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ఎల్‌పిజి సిలిండర్ రూ. 703కు అందుబాటులోకి వస్తుంది.

ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ అనురాగ్ ఠాకూర్ ప్రకటిస్తూ గృహ వినియోగదారులకు ఊరట కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేగాక ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను మరో 75 లక్షలు అందచేస్తామని, దీంతో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News