Monday, January 20, 2025

డబ్బులొచ్చాయి

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటా కింద గురువారం నిధులు విడుదల చేసింది.మొత్తం రూ.1,78,173కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ నిధులు ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి ,మూల ధన వ్యాయానికి ఊతమిస్తాయని కేంద్రం అభిప్రాయపడింది. కేంద్రం ముందస్తు వాటా రూ.89,086,.50కోట్లతో కలిపి రూ.1,78,173కోట్లు విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట పన్నుల వాటా రూపంలో రూ.3,745కోట్లు దక్కనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.7,211కోట్లు విడదలయ్యాయి.

అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.31, 962కోట్ల మేరకు కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాగా కేటాయించింది. ఆ తర్వాత బీహార్ రాష్ట్రానికి రూ.17,921కోట్లు కేటాయించింది.మధ్యప్రదేశ్‌కు రూ.13987కోట్లు, మహారాష్ట్రకు రూ.11255కోట్లు కేటాయించింది. ఒడిశాకు రూ.8068కోట్లు, రాజస్థాన్‌కు రూ.10737కోట్లు కేటాయించింది. తమిళనాడుకు రూ.7268కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.13404కోట్లు కేటాయించింది. మిగతా రాష్ట్రాలకు కూడా ఆయా రాష్ట్రాల పన్నుల వాటా మేరకు నిధులు కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News