Monday, December 23, 2024

రాష్ట్రాలకు అదనపు నిధులు రూ.72,961 కోట్లు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ వాటా రూ.1,533.64 కోట్లు, విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రాలకు రూ.72,961.21 కోట్ల అదనపు వాయిదాను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో తెలంగాణ రాష్ట్రానికి వాటా రూ.1,533.64 కోట్లు నిధులను విడుదల చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,952.74 కోట్ల నిధులను ఇచ్చింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ. 13,088.51 కోట్లు నిధులను అందించింది. సాం ఘిక సంక్షేమానికి సంబంధించిన పథకాలతో పాటు మౌలిక సదుపాయాల బలోపేతం కోసం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహా యం అందించే పన్ను ఆదాయం నుండి ఈ అందిస్తోంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలియజేస్తూ ఆర్థిక శాఖ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ మొత్తం 2023 డిసెంబరు 22న విడుదలైన రూ.72,961 కోట్లు, 2023 డిసెంబరు 11న విడుదలైన రూ.72,961.21 కోట్ల వాయిదాలకు అదనం అని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిలో గరిష్టంగా రూ.13,088.51 కోట్లు ఉత్తరప్రదేశ్‌కు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. బీహార్‌కు రూ.7,338.44 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.5,727.44 కోట్లు విడుదలయ్యాయి.

పశ్చిమ బెంగాల్‌కు రూ.5,488.88 కోట్లు, రాజస్థాన్‌కు పన్ను వాటాగా రూ.4,396.64 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా చత్తీస్‌గఢ్‌కు రూ.2,485.79 కోట్లు, మహారాష్ట్రకు రూ.4,608.96 కోట్లు, కర్నాటకకు రూ.2,660.88 కోట్లు ప్రభుత్వం విడుదల చేసి ంది. కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను రాష్ట్రాలకు వారి మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు, సామాజిక సంక్షేమానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన ప్రాజెక్టు లు, కార్యక్రమాలకు ఖర్చు చేయడానికి అందిస్తుం ది. కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను పన్నుల నుండి రాష్ట్రాలకు 14 విడతలుగా విడుదల చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News