Friday, December 20, 2024

బోర్న్‌విటా ‘హెల్త్ డ్రింక్ కాదు’: కేంద్రం సంచలన ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బోర్న్‌విటాలో చక్కెర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని ఇటీవల ఎన్‌సీపీపీఆర్ నిర్ధారించిన నేపథ్యంలో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ వాఖ కీలక అడ్వైజరీని జారీ చేసింది. బోర్న్ విటీ హెల్త్ డ్రింక్స్ కేటగిరి లోకి రాబోదని తెలిపింది. ఈ కేటగిరి నుంచి బోర్న్‌విటాను తొలగించాలని ఈ కామర్స్ కంపెనీలను వాణిజ్య మంత్రిత్వశాఖ ఆదేశించింది. తమ వెబ్ సైట్లు, ఇతర ప్లాట్‌ఫామ్స్ పై బోర్న్‌విటాతోపాటు అన్ని డ్రింక్స్ , బేవరీజులను హెల్త్ కేటగిరి నుంచి తొలగించాలని సలహా ఇచ్చింది.

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (సిపిసిఆర్) చట్టం 2005 లోని సెక్షన్ (3) కింద ఏర్పాటైన బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్‌సీపీసీఆర్ (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) ఇటీవల సీఆర్‌పీసీ 2005 చట్టం లోని సెక్షన్ 14 కింద విచారణ చేపట్టింది. ఎఫ్‌ఎస్‌ఎస్ చట్టం, 2006, మోడర్జ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమ, నిబంధనలు హెల్త్ కేటగిరి డ్రింక్స్‌ను నిర్వచించలేదని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నాయని, ఆమోదయోగ్య పరిమితులకు మించి ఎక్కువగా ఉన్నాయని ఎన్‌సీపీసీఆర్ చేసిన పరిశోధనలో తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News