- Advertisement -
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన పథకానికి బుధవారం కేంద్రం ‘ప్రధాన మంత్రి పోషణ్’(పిఎం పోషణ్) అని కొత్త పేరు పెట్టింది. వచ్చే ఐదేళ్లలో ఈ పథకానికి రూ. 1,30,795 కోట్లు ఖర్చు పెట్టనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకం 2021-22 నుంచి 2025-26 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 11.2 లక్షల పాఠశాలల్లో 1నుంచి 8వ తరగతి వరకు చదివే 11.8 కోట్ల మంది విద్యార్థులకు అమలుచేయనున్నారు. ఈ పథకంను ఇంతవరకు చేర్చని ప్రీప్రైమరి లేక బాలవాటికలకు కూడా విస్తరించనున్నారు. ఇంతేకాక ప్రభుత్వం పాఠశాలల్లో న్యూట్రిషనల్ గార్డెన్స్ కూడా ప్రోత్సహించనున్నది.
- Advertisement -