Tuesday, March 18, 2025

వయనాడ్ పునరావాసానికి కేంద్రం రూ. 529.50 కోట్ల రుణసాయం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రమాదానికి సంబంధించి బాధితుల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి రూ. 529.50 కోట్ల రుణ సహాయాన్ని మంజూరు చేసింది. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకం 202425 పథకం అందజేసిన ఈ నిధులు మార్చి 31 నాటికి వినియోగించాలని షరతు విధించింది. ఇది గ్రాంటు కాదని రుణమని ఈ విధంగా గడువు విధించడం ఆచరణాత్మకంగా పెద్ద సమస్య అని రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ పేర్కొన్నారు. రుణ నిబంధనల ప్రకారం రుణం విడుదలైన పది రోజుల్లోనే పనులు చేపట్టే ఏజెన్సీలకు నిధులను బదిలీ చేయాల్సి ఉంది. ఈ వ్యవధి దాటి ఆలస్యమైతే ఓపెన్ మార్కెట్ రుణాలపై మునుపటి సంవత్సరం వెయిటెడ్ వడ్డీ రేటు ప్రకారం వడ్డీ ఛార్జీలు విధించడమవుతుంది. ఈ నిబంధనలు ఉన్నప్పటికీ, పునరావాస పనులతో ముందుకు వెళ్తామని బాలగోపాల్ చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ కేంద్రం నిర్ణయాన్ని విమర్శించారు. కేరళకు రూ. 2000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ పొందడానికి అర్హత ఉందని, ఈ విషయంలో కేంద్రం తనవైఖరిని సరిదిద్దుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News