Wednesday, January 22, 2025

ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం సీరియస్..జరిమానాలు రెట్టింపు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం సీరియస్ అయింది. కాలుష్యాన్ని కట్టడి చేయడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకొంది. రైతులు తమ పంట వ్యర్థాలను దహనం చేస్తే అత్యధికంగా రూ.30 వేలు వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యతను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకొంది. తక్షణం అమల్లోకి వచ్చిన సరికొత్త నిబంధనల ప్రకారం 2 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతు వ్యర్థాలను దహనం చేస్తే రూ. 5 వేలు జరిమానా చెల్లించాలి. అదే 25 ఎకరాల మధ్య లోని వారు రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే రూ.30 వేలు ఫైన్ వేస్తారు. ఈ సరికొత్త నిబంధనలు ‘ది కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ చట్టం2021 లో భాగం.

గతనెల చివర్లో ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరును తప్పు పట్టింది. పర్యావరణ పరిరక్షణకు కేంద్రం పదును లేని చట్టాలు చేస్తోందని వ్యాఖ్యానించింది. అసలు ఈ చట్టాలను అమలు చేయడానికి అధికారులను నియమించడం లేదని తప్పు పట్టింది. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి స్పందిస్తూ పర్యావరణ చట్టాల్లో జరిమానాలను బలంగా అమలు చేస్తామని న్యాయస్థానానికి చెప్పారు. నిబంధనలను మరో పది రోజుల్లో కఠినతరం చేస్తామని హామీ ఇచ్చారు. కొన్నాళ్లుగా ఢిల్లీ చుట్టుపక్కల గాలి నాణ్యత ఘోరంగా మారింది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 356 కు చేరింది. దీంతో కేంద్రం జరిమానా మొత్తాల్ని పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News