మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా గణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్‌లో బిసి బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. శనివారం బిసి సంఘం ప్రతినిధులతో కలిసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా బిసిల సమస్యలపై కేంద్రమంత్రికి వివరించి, లేఖను ఆయన అందజేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బిసిల డిమాండ్లపై ప్రధానమంత్రితో చర్చిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో ప్రధానమంత్రితో చర్చలకు బిసి సంఘాల నాయకులు రావాలని ఆయన కోరారు. బిసిలు ఎదుర్కొంటున్న 14 అంశాలను కేంద్రమంత్రికి వివరించామని ఆర్.కృష్ణయ్య తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బిసి ప్రతినిధులు నీల వెంకటేష్, దాసు సురేష్, సి.రాజేందర్, జయంత్ పండరీనాథ్, బిసి అడ్వకేట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్‌యాదవ్, జక్కుల వంశీకృష్ణ, జి.అనంతయ్య, విద్యార్ధి సంఘం రాష్ట్ర అద్యక్షులు జి.కృష్ణయాదవ్, ఉదయ్, నిఖిల్, వంశీ, మల్లేష్ ఉన్నారు.
Centre should be conduct census: R Krishnaiah