- Advertisement -
శిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో ఈ సీజన్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా రూ.12 వేల కోట్ల ఆస్తినష్టంతోపాటు 400 మందికి పైగా మృతి చెందినట్టు , ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించాయి. ఈ విపత్తును తలచుకొని ఇప్పటికీ అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు బిలాస్‌పూర్ జిల్లాలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ ప్రాజెక్టులు, వ్యవసాయం, హార్టికల్చర్ తదితర శాఖలకు దాదాపు రూ.215 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. జిల్లాలో ధ్వంసమైన రహదారులకు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయన్నారు.
- Advertisement -