Saturday, July 6, 2024

కరుణించిన జిఎస్‌టి కౌన్సిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ 53వ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన వివరాలను నిర్మలా సీతారామన్ వెల్లడించారు, సెక్షన్ 73 కింద విధించే జరిమానాలపై ప్రధానంగా చర్చించినట్లు మంత్రి తెలియజేశారు. జరిమానాలపై వేస్తున్న వడ్డీ ఎత్తివేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయని ఆమె తెలిపారు, సిజిఎస్‌టి చట్టంలో సవరణలకు జిఎస్‌టి కౌన్సిల్ ప్రతిపాదించినట్లు నిర్మల తెలియజేశారు, ఇక అన్ని కార్టన్
బాక్సులపై జిఎస్‌టిని 12 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు, ఆపిల్, ఇతర పండ్ల వ్యాపారులకు ఈ నిర్ణయంతో మేలు కలుగుతుందని, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లోని ఆపిల్ సాగుదారులకు లాభిస్తుందని ఆమె తెలిపారు,

స్ప్రింక్లర్లపై జిఎస్‌టిని 12 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు. ఈ నిర్ణయం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆమె తెలిపారు, అల్యూమినియం, స్టీల్ పాల క్యాన్లపై, సోలార్ కుక్కర్లపై కూడా జిఎస్‌టిని 12 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. రైల్వే ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు, రైల్వే శాఖ అందించే వెయిటింగ్ రూమ్ సేవలు, రిటైరింగ్ రూమ్ సేవలు, సామాన్లు భద్రపరుచుకునే సౌలభ్యం, రైల్వే శాఖ ప్లాట్‌ఫామ్‌లపై అందించే బ్యాటరీ ఆధారిత వాహన సేవలను కూడా జిఎస్‌టి నుంచి మినహాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక రేట్ రేషనలైజేషన్ మంత్రుల సంఘం చైర్మన్‌గా బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని నియమించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మద్దతు : నిర్మలా సీతారామన్
రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఎప్పుడూ ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు, ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక శాఖ మంత్రులతో నిర్మల ఢిల్లీలో సమావేశమయ్యారు, ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ, సకాలంలో జిఎస్‌టి బకాయిల చెల్లింపు, పన్నుల పంపిణీ ద్వారా రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని చెప్పారు. వివిధ సంస్కరణల కోసం కేంద్రం అందజేస్తున్న 50 ఏళ్ల వడ్డీరహిత రుణాలను అన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలని ఆమె సూచించారు,

అయితే, ఈ పథకం ద్వారా అందిన మొత్తాన్ని పౌర కేంద్రీకృత ప్రాజెక్టుల కోసం వినియోగించవలసి ఉంటుందని ఆమె సూచించారు, ఈ షరతులకు లోబడి ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చునని మంత్రి సూచించారు, కరోనా అనంతరం రాష్ట్రాల మూలధన వ్యయాలను పెంచే లక్షంతో కేంద్రం ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్’ పేరిట వడ్డీలేని రుణాలను తీసుకువచ్చింది, 2024=25 బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ మంత్రుల సలహాలు, సూచనలను నిర్మల తీసుకున్నారు, బడ్జెట్‌కు సంబంధించి మంత్రుల అభిప్రాయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News