Monday, December 23, 2024

మళయాళం ఛానెల్ మీడియా వన్‌పై కేంద్రం నిషేధం

- Advertisement -
- Advertisement -

Centre suspends Malayalam news channel MediaOne

 

తిరువనంతపురం : మళయాళం టీవీ ఛానెల్ మీడియా వన్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఇప్పటికే ఈ టీవీ ఛానెల్‌పై రెండు రోజుల పాటు నిషేధం విధించిన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ మరోసారి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 30, 2021 నుంచి సెప్టెంబర్ 29,2031 వరకు టీవీ ఛానెల్ లైసెన్స్‌ను రెన్యువల్ చేయాలని కేద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు మీడియా వన్‌ఛానెల్ దరఖాస్తు పెట్టుకుంది. ఈ దరఖాస్తును కేంద్ర హోం మంత్రిత్వశాఖ తిరస్కరించింది. 2020 మార్చిలో ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేలా మళయాళం ఛానల్స్ ఏసియన్ నెట్, మీడియా వన్ ప్రసారాలు చేశాయని కేంద్రం రెండు రోజుల పాటు నిషేధం విధించింది. తిరిగి మీడియా వన్ పై నిషేధం విధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News