Sunday, December 22, 2024

వచ్చే ఏడాది జనగణన?

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే బాగా ఆలస్యమైన జనాభా లె క్కల సేకరణ ప్రక్రియను జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) అప్‌డేట్ కో సం కేంద్రం 2025 ఆరంభంలో ప్రారంభించే అవకాశం ఉన్నది. సర్వే డేటా ను 2026లో ప్రకటించనున్నారు. అయితే, కుల గ ణన పై ఇంత వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదని అధికార వర్గాలను ఉటంకిస్తూ ‘పిటిఐ’ వార్తా సం స్థ తెలిపింది. ‘జన గణన, ఎన్‌పిఆర్ కోసం పని వ చ్చే ఏడాది ఆరంభంలో మొదల య్యే అవకాశం ఉ న్నది. జనాభా డేటాను 2026లో ప్రకటించనున్నా రు. దీనితో జన గణన వలయం మారే అ వకాశం ఉన్నది.

అందువల్ల భవిష్యత్తులో 20252035, 20352045 అలా ఆ వలయం సాగుతుం ది’ అ ని అధికార వర్గాలు సూచించాయి. అయితే, ‘కుల గణనపై ప్ర భుత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు’ అని ఆ వర్గా లు తెలిపాయి. జనాభా లెక్కల ప్రక్రియను దేశం లో 1951 నుంచి ప్రతి పది సంవత్సరాలకు చేపడుతున్నారు. కానీ 2021లో కొవిడ్19 మహమ్మారి కారణం గా ఆ ప్రక్రియ ఆల స్యం అ యిం ది. దేశంలో ఒబిసి మొత్తం జనాభా తెలియడానికి వీలు గా కుల గణన నిర్వహించాలని కాం గ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు కోరాయి కూడా. జన గణన ప్రక్రి య నియోజకవర్గాల పు నర్విభజన ప్రక్రియకు కూడా దారి తీయవచ్చు. అది 2026 లోజరగనున్నది.

కుల గణన చేపట్టాలి
తదుపరి జనాభా లెక్కల సేకరణలో అ న్ని కులాల సమగ్ర గణన భాగం అవుతుందా, లోక్‌సభలో ప్రతి రాష్ట్రం బలం నిర్ధారణకు జనగణనను ఉపయోగిస్తారా అనే అంశాలపై స్పష్టత కోసం అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ సోమవారం కోరింది. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ పదవీ కాలం పొడిగింపును ప్రకటించారని, అంటే 2021లోనే జరగవలసి ఉన్నా ఇప్పటికే బాగా ఆలస్యమైన జన గణనను త్వరలో చేపట్టనున్నారని అర్థం అవుతున్నదని కాంగ్రెస్ ప్రధాన కా ర్యదర్శి కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జైరా మ్ రమేష్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. 1951 నుంచి ప్రతిసారి జనగణనలో చేసినట్లుగా షె డ్యూల్డ్ కులాలు, షెడ్యూ ల్డ్ తెగల వివరాలతో పాటు దేశంలోని అన్ని కులాల సమగ్ర గణనను కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News