Monday, December 23, 2024

ఏడాది పాటు విమోచన ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయం
నాటి నిజాం సంస్థానంలోని ప్రాంతాల్లో ఏర్పాట్లు
తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర సిఎంలకు ఆహ్వానం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: ఎంఐఎం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి భయమని, మజ్లిస్‌కు భయపడి విమోచన వేడుకలు జరపట్లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. దీంతోపాటుగా ఏడాదిపాటు హైదరాబాద్ విమోచన ఉత్సవాలను నిజాం సంస్థా నానికి సంబంధించిన ప్రాంతాల్లో నిర్వహించనున్నామన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంతో పాటుగా ఏడాది పాటు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతూ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కిషన్ రెడ్డి లేఖ రాశారు. ‘ఈ నెల 17న కేంద్ర బలగాలతో పరేడ్ గ్రౌండ్‌లో విమోచన వేడుకలు నిర్వహిస్తామని కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా అధికారికంగా విమోచన వేడుకలు నిర్వహిస్తామని, హైదరాబాద్‌లో జరిగే వేడుకలకు అమిత్‌షా హాజరవుతారని తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగానే విమోచన వేడుకలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

Centre to Celebrate Telangana Liberation Day on Sep 17

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News