- Advertisement -
న్యూఢిల్లీ: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న దేశీయ విమాన ప్రయాణికులకు కొవిడ్19 నెగెటివ్ ధ్రువీకరణ నుంచి మినహాయింపు ఇచ్చే యోచనలో ఉన్నట్టు కేంద్రంలోని సీనియర్ అధికారులు తెలిపారు. దీనిపై ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే దిశగా విమానయానశాఖ, కేంద్ర ఆరోగ్యశాఖలు భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తున్నాయని ఆ అధికారులు తెలిపారు. ఆరోగ్యం రాష్ట్రాల అధికార పరిధిలోని అంశమైనందున రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం తీసుకుంటున్నామని తెలిపారు. ఒడిషా, మేఘాలయ, మహారాష్ట్రసహా పలు రాష్ట్రాలు ప్రస్తుతం విమాన ప్రయాణాలకు కొవిడ్19 నెగెటివ్ రిపోర్టును తప్పనిసరి చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరినాటికి దేశీయ విమానాల రోజువారీ ప్రయాణికుల సంఖ్య మూడు లక్షలకు చేరగా, ఆ తర్వాత సెకండ్ వేవ్ రావడంతో ఇప్పుడా సంఖ్య 85,000కు పడిపోవడం గమనార్హం.
Centre to exemption to fully vaccinated air travelers
- Advertisement -