Sunday, December 22, 2024

రాష్ట్రాలకు రూ. 75,000 కోట్ల వడ్డీ లేని రుణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వికసిత భారత్ దార్శనికతను సాకారం చేసుకునేందుకు రాష్ట్రాలు చేపట్టే సంస్కరణలకు 50 ఏళ్ల కోసం వడ్డీ లేకుండా రూ. 75,000 కోట్ల రుణాలను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రుణాలను అందచేయనున్నది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్యిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం దార్శనికతను ఏర్పర్చుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం సమర్పించిన తాత్కాలిక బడ్జెట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. వికసిత భారత్ దార్శనికతను సాకారం చేసుకునేందుకు అభివృద్ధికి సంబంధించిన అనేక సంస్కరణలను రాష్ట్రాలు చేపట్టాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పెను సంస్కరణలకు మద్దతుగా 50 ఏళ్ల వడ్డీలేని రుణాన్ని సమకూర్చేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 75,000 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2024-25(బడ్జెట్ అంచనాలు) ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వాటాలు, గ్రాంట్లు, రుణాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలతోసహా కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్యే మొత్తం వనరులు రూ.22,22,264 కోట్లుగా బడ్జెట్ పత్రాలు చూపుతున్నాయి. జులైలో ప్రవేశపెట్టే పూర్తి బడ్జెట్‌లో వికసిత భారత్‌కు సంబంధించిన సమగ్ర రోడ్‌మ్యాప్‌ను వివరిస్తామని ఆమె తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News