Friday, November 15, 2024

కొవిడ్ మరణాలపై విశ్వసనీయ డేటా వెల్లడించాలి: రాహుల్‌గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 వల్ల మరణించినవారి విశ్వసనీయ డేటాను కేంద్రం వెల్లడించాలని, వారి ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. గుజరాత్‌లో కొవిడ్‌తో మృతి చెందినవారి కుటుంబాల వీడియోను రాహుల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. వారికి సమయానికి ఎలాంటి సహాయం అందలేదని ఆయన తెలిపారు. ఇదేనా గుజరాత్ నమూనా అంటూ రాహుల్ ప్రశ్నించారు. ‘4 లాక్ దేనా హోగా’ హ్యాష్‌ట్యాగ్‌తో హిందీలో పోస్ట్ పెట్టారు. 4.31 నిమిషాల వీడియోలో కాంగ్రెస్ న్యాయ ప్రచారం పేరుతో రాహుల్ బిజెపిపై విమర్శలు చేశారు. గుజరాత్ నమూనా పేరుతో ఎంతో ప్రచారం సాగించారు. కానీ, గుజరాత్‌లో కొవిడ్ పేషెంట్లు ఆస్పత్రుల్లో పడకలూ, వెంటిలేటర్లు దొరకనిస్థితిని ఎదుర్కొన్నారని రాహుల్ తెలిపారు. ఆస్పత్రుల్లో బాధితులు రూ.1015 లక్షలు ఖర్చు చేశారు. చనిపోయిన బాధితుల కుటుంబాలకు సహాయం అందించాల్సిన సమయంలోనూ నిర్లక్షం వహించారని రాహుల్ విమర్శించారు.

గుజరాత్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో కొవిడ్ వల్ల 10,000మంది మాత్రమే చనిపోయారని చెబుతోంది. వాస్తవానికి చనిపోయింది మూడు లక్షలమంది అని రాహుల్ అన్నారు. గుజరాత్ నమూనా అంటే పరిహారం రూ.50,000 మాత్రమే ఇవ్వడమా అని రాహుల్ ప్రశ్నించారు. ప్రధానమంత్రికి కొత్త విమానం కొనడానికి రూ.8500 కోట్లు ఉన్నాయి. కానీ, కొవిడ్ వల్ల మరణించినవారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవంటూ రాహుల్ దుయ్యబట్టారు. కొవిడ్ వల్ల మృతి చెందిన పేద కుటుంబాలవారందరికీ రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించేవరకూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఒత్తిడి చేస్తుందని రాహుల్ తెలిపారు. వచ్చే ఏడాది చివరన గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ ఆ రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించినట్టుగా అర్థమవుతోంది.

Centre to release correct data on Corona deaths: Rahul

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News