Wednesday, April 2, 2025

విదేశీ విరాళాలపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

- Advertisement -
- Advertisement -
Centre told Supreme Court that FCRA registrations
విదేశీ విరాళాలపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం

న్యూఢిల్లీ: గడువు తేదీ లోగా దరఖాస్తు చేసుకున్న 11,594 స్వచ్ఛంద సంస్థల( ఎన్‌జిఓల) విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్ట రిజిస్ట్రేషన్లను (ఎఫ్‌సిఆర్‌ఎ) ఇప్పటికే పునరుద్ధరించినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు సుప్రీంకోర్టులో ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి చెల్లుబాటులో ఉన్న అన్ని సంస్థల ఎఫ్‌సిఆర్‌ఎలను తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కొనసాగించాలంటూ దాఖలయిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది.

పిటిషనర్లు సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని చట్టానికి అనుగుణంగా అధికారులు వారి అభ్యర్థనలను పరిశీలించవచ్చని న్యాయమూర్తులు దినేశ్ మహేశ్వరి, సిటి రవికుమార్‌లు కూడా ఉన్న బెంచ్ స్పష్టం చేసింది. ఏ సంస్థ లేదా ఎన్‌జిఓ విదేశీ విరాళాలు పొందాలంటే ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. గడువు తేదీ లోగా 11,594ఎన్‌జిఓలు దరఖాస్తు చేసుకోగా వాటి రిజిస్ట్రేషన్లను పొడిగించడం జరిగిందని తుషార్ మెహతా బెంచ్‌కి తెలియజేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా 5,789 ఎన్‌జిఓలు తమ ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్లను కోల్పోయిందంటూ దీనిపై మధ్యతర ఉత్తర్వులు జారీ చేయాలంటే అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. మెహతా వాదనలను బెంచ్ ప్రస్తావిస్తూ అధికారులు తీసుకున్న వైఖరి దృష్టా ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలయిన పలు పిటిషన్లపై తీర్పు ప్రకటించిన తర్వాత ఈ పిటిషన్‌ను విచారిస్తామని బెంచ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News