దుర్వినియోగానికి ఆస్కారం లేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే మాస్క్‌డ్ కార్డు ఫోటోకాపీ( జెరాక్స్)ని మాత్రమే ఇవ్వాలంటూ జారీ చేసిన హెచ్చరికలను కేంద్రం ఉపసంహరించుకుంది. ఇటీవల కొందరు వ్యక్తులు ఆధార్‌కార్డులో ఫోటోషాప్‌లో మార్పులు చేసి దుర్వినియోగం చేశారని తెలిపింది. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకుని బెంగళూరులోని స్థానిక యుఐడిఎఐ కార్యాలయం సదరు మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపింది. అలాంటి చర్యలను అరికట్టడంలో భాగంగానే ఆ పత్రికా ప్రకటన జారీ చేయాల్సివచ్చిందని వివరించింది. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నామని కేంద్రం తెలిపింది.ఆధార్ వినియోగంలో పౌరులు పరిస్థితులనుబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపింది. ఆధార్‌లోని వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని పేర్కొంది.అనధీకృత వ్యక్తులు,సంస్థలు ఆధార్‌లో గోప్యంగా ఉండే వివరాలను పొందే అవకాశం లేదనిస్పష్టం చేసింది. యుఐడిఎఐ వ్యవస్థను అంత పటిష్టంగా రూపొందించామని కేంద్రం తెలిపింది.