Monday, January 20, 2025

నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రకటించనున్న కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నవతరం టెక్నాలజీ ప్రభావ శీలురు, రూపకర్తలను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రియేటర్స్ అవార్డులను త్వరలోనే ప్రకటించనుందని అధికార వర్గాలు శుక్రవారం తెలియజేశాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియాతో సంబంధాలు కలిగి ఉన్న యువతరాన్ని ‘జెన్ జడ్’గా అభివర్ణిస్తారు. ఈ వర్గాలను లక్షంగా చేసుకుని ఇలాంటి అవార్డులను ఇవ్వడం ఇదే తొలిసారని, 20 కేటగిరీల్లో ఈ అవార్డులను ఇస్తారని ఆ వర్గాలు తెలిపాయి.

యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్రభావ శీలురు కూడా ఈ అవార్డుల కోసం పోటీ పడవచ్చని వారు తెలిపారు. దేశంలో సాఫ్ట్‌వేర్ శక్తిని, సంస్కృతిని అంతర్జాతీయంగా వ్యాప్తి చేయడానికి దోహదపడే వారికోసం ఈ కేటగిరీల్లో ఒకదాన్ని కేటాయించనున్నట్లు కూడా వారు తెలిపారు. గ్రీన్ చాంపియన్స్. స్వచ్ఛ అంబాసిడర్లు, ఆగ్రో క్రియేటర్లు, టెక్ క్రియేటర్లు లాంటి కేటగిరీలు కూడా ఇందులో ఉంటాయని వారు తెలిపారు. జాతీయ చలనచిత్ర అవార్డులు తరహాలో ఈ అవార్డులు ఉంటాయని కూడా వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News