Friday, November 22, 2024

మంచి సలహాలిచ్చినా కేంద్రం అలర్జీగా తిరస్కరిస్తోంది: రాహుల్‌గాంధీ

- Advertisement -
- Advertisement -

Centre's 'failed policies' led to second wave of Covid-19

న్యూఢిల్లీ: కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విట్టర్ వేదికగా శనివారం మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోందని, తాము మంచి సలహాలు ఇచ్చినా స్వీకరించకుండా అలర్జీగా భావిస్తోందని రాహుల్ విమర్శించారు. కేంద్రం అనుసరించిన విధానాల వైఫల్యం వల్లే దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతికి దారితీసిందని రాహుల్ విమర్శించారు. వలస కార్మికులు మరోసారి తమ ఇళ్లకు తిరుగుముఖం పట్టేలా ఒత్తిడికి గురవుతున్నారని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతోపాటు సామాన్య ప్రజలు తమ జీవితాలను కాపాడుకునేందుకు వారి చేతికి డబ్బు అందించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News