Sunday, January 12, 2025

రాయ్‌పూర్‌లో సెంట్రింగ్ ఫ్రేమ్ కూలి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో శనివారం నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం సెంట్రింగ్ ఫ్రేమ్ కూలి ఎనిమిది మంది మృతి చెందారు. మరి ఆరుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన విశాల్ నగర్‌లోని విఐపి రోడ్డులో జరిగిందని రాయ్‌పూర్ పోలీస్ అదనపు సూపరింటెండెంట్ లఖన్ పటేల్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఏడవ అంతస్తు నుంచి 10వ అంతస్తు వరకు శ్లాబ్ వేస్తున్నప్పుడు సెంట్రింగ్ ఫ్రేమ్ కూలి ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఇనుప కడ్డీలు, నిర్మాణ సామాగ్రి శిథిలాల కింద చిక్కుబడిన ఎనిమిది మంది కార్మికులను వెలికితీసి వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. వారిలో ఇద్దరు ఆసుపత్రిలో కన్నుమూశారని లఖన్ పటేల్ వివరించారు. శిథిలాల కింది ఇంకా ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోడానికి నిర్మాణ సామాగ్రిని అక్కడి నుంచి తొలగించినట్లు కూడా ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News