Saturday, November 16, 2024

33 బంతుల్లోనే శతకం

- Advertisement -
- Advertisement -

టి20లో నమీబియా క్రికెటర్ జాన్ నయా చరిత్ర

ఖాట్మాండు: అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో నమీబియా యువ సంచలనం జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్ నయా చరిత్ర సృష్టించాడు. నేపాల్ వేదికగా జరుగుతున్న ట్రైసిరీస్‌లో జాన్ ఈ రికార్డును నెలకొల్పాడు. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జాన్ నికోల్ 33 బంతుల్లోనే సెంచరీ సాధించి టి20ల్లో అత్యంత వేగంగా శతకం సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. 11వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన జాన్ 33 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఈ క్రమంలో 8 సిక్సర్లు, మరో 11 బౌండరీలు బాదేశాడు. ఇదే సమయంలో ఇప్పటి వరకు నేపాల్ క్రికెటర్ కుశాల్ మల్లా పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తిరగరాశాడు.

గతంలో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో కుశాల్ మల్లా 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో 12 సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. కాగా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో జాన్ నికోల్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులుయ చేసింది. జాన్ నికోల్ 36 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 18.5 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. నికోల్ బంతితోనూ రాణించి రెండు వికెట్లను పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News