- Advertisement -
హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పలువురు జిల్లా పరిషత్ ల సిఇఒలు, డిప్యూటీ సీఇఒలు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమవారం కలిశారు. తమకు పదోన్నతులు కల్పించినందుకు మంత్రికి వారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా, ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ సకాలంలో అందేవిధంగా పని చేయాలని మంత్రి ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో సిఇఒలు, డిప్యూటీ సీఇఒల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్ రావు, ఎంపిడిఒల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సత్తయ్య, పలువురు సిఇఒలు, డిప్యూటీ సిఇఒలు ఉన్నారు.
- Advertisement -