Wednesday, January 22, 2025

కుమారుడిని చంపిన సిఇఒ… మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకొని

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఓ మహిళా వ్యాపారవేత్త తన కుమారుడిని చంపి అనంతరం బ్యాగులో మృతదేహంతో గోవా నుంచి కర్నాటకకు ప్రయాణించింది. ఆమెను కర్నాటకలోని చిత్రదుర్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కర్నాటక రాష్ట్రానికి చెందిన సుచనా సేత్ ఓ స్టార్టప్‌ని స్థాపించి సిఇఒగా పని చేస్తుంది. తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి గోవాకు వెళ్లింది. హోటల్‌లో రూమ్ తీసుకొని ఉంది. ఆమె వెళ్లిన తరువాత రూమ్‌లో రక్తపు మరకలు కనిపించడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హోటల్‌కు చేరుకొని సిసి కెమెరాలను పరిశీలించగా… హోటల్‌లోకి వస్తున్నప్పుడు బాబుతో ఆమె వచ్చింది.

హోటల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా వెళ్లడంతో పోలీసులకు అనుమానం వచ్చి ట్యాక్సీ డ్రైవర్‌కు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడారు. తన స్నేహితుడి వద్ద కుమారుడిని వదిలి పెట్టానని వివరణ ఇచ్చింది. దీంతో ఆమె చెప్పిన అడ్రస్ వెళ్ల వెతకగా రాంగ్ అని తేలడంతో ట్యాక్సీ డ్రైవర్‌కు ఓ పోలీస్ స్టేషన్ ముందు ఆపాలని పోలీసుల సూచనలు చేశారు. కర్నాటక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిత్రదుర్గ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సుచనాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News