Monday, December 23, 2024

తెలంగాణలోనే కొనసాగుతాం

- Advertisement -
- Advertisement -

తెలంగాణలోనే కొనసాగుతామని సెమీకండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీ తేల్చి చెప్పింది. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని సంస్థ సీఈ ఓ రఘు ఫణికర్ సిఎం రేవంత్‌తో స్పష్టం చేశారు. ఈ నెల 23వ తేదీన కొంగరకలాన్‌లో కేన్స్ సంస్థ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ ను ప్రారంభించబోతుందని ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రఘు ఫణికర్ సోమవారం సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఓఎస్‌ఏ టి యూనిట్ ఇండియన్ సెమికండక్టర్ మిషన్ పరిశీలనలో ఉంది. ఐఎస్‌ఎం అనుమతి రాగానే ఓశా ట్ యూనిట్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని ఫణికర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News