Friday, November 22, 2024

కమలాపూర్ లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ఈ నెల 30 న జరుగనున్న హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు. శనివారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు), ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ, అంబాల జడ్.పి.హెచ్.ఎస్, గూడూరు ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్, కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి కర్ణన్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జ్యోతిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా పాఠశాలల్లోని 290, 291,287,286,266,267,269,268,265 నెంబరు గల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రోజున ఓటర్ల రద్దీ లేకుండా, కోవిడ్ నిబంధనల మేరకు వారిని వరుసక్రమంలో ఓటు వినియోగించుకునెందుకు పంపించాలని అధికారులకు సూచించారు. ఓటర్లు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలని, చేతులు సానిటైజ్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశ వర్కర్ ను నియమించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో ర్యాంపులు, ఫర్నిచర్, విద్యుత్, టాయిలెట్ సౌకర్యం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎన్నికల అధికారులు పోలీస్ అధికారులతో సమావేశమై ఎన్నికల సరళి, నిర్వహణపై చర్చించారు.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్.వి కర్ణన్ శనివారం సందర్శించారు. ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో ముద్రించిన బ్యాలెట్ పత్రాలు పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఎన్నికల సామాగ్రిని జిల్లాఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పరిశీలించారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రిని తీసుకువెళ్లేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి ఆర్ డిఓసిహెచ్ రవీందర్ రెడ్డి ఉన్నారు.

CEO Shashank Goyal inspects polling centers at Kamalapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News