- Advertisement -
సైబర్ దాడులపై సెర్ట్‌ఇండియా హెచ్చరిక
న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారులు తమ సమాచారం చోరీ కాకుండా అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్‌ఇండియా హెచ్చరించింది. సైబర్ దాడులకు గురి కాకుండా వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. వాట్సాప్‌లోని కొన్ని బలహీనమైన అప్లికేషన్ల ద్వారా సైబర్ నేరగాళ్లు వినియోగదారుల సిస్టమ్స్‌లోకి చొచ్చుకువెళ్లి సున్నిత సమాచారాన్ని తస్కరిస్తున్నారని సెర్ట్‌ఇండియా తెలిపింది. వాట్సాప్‌లోని కొన్ని అప్లికేషన్ల ద్వారా సైబర్ నేరగాళ్లు రిమోట్ పద్ధతిలో సిస్టమ్స్‌లోకి ప్రవేశిస్తున్నారని, ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు ఫిర్యాదులందాయని సెర్ట్‌ఇండియా తెలిపింది. సైబర్ మోసాల నుంచి బయటపడేందుకు వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని, అందుకు గూగుల్ ప్లే లేదా ఐఒఎస్ యాప్ స్టోర్‌ను ఉపయోగించుకోవాలని సెర్ట్‌ఇండియా సూచించింది.
- Advertisement -