Monday, December 23, 2024

4న ఎంఎస్సీ నర్సింగ్, ఎంపిటి కోర్సుల్లో ప్రవేశాలకు ధృవపత్రాల పరిశీలన

- Advertisement -
- Advertisement -

Certificate verification for Admission in MSc Nursing and BPT courses

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంఎస్‌సి నర్సింగ్, ఎంపిటి కోర్సుల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 4వ తేదీన కూకట్‌పల్లిలోని జెఎన్‌టియుహెచ్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్‌సి నర్సింగ్, ఎంపిటి కోర్సులకు ఇటివలే దరఖాస్తుల ప్రక్రియ గడువు ముగియగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధారంగా ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్‌ను యూనివర్సిటీ విడుదల చేసింది. ధృవపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 4న జెఎన్‌టియుహెచ్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌లో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలి. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్ www. knruhs.telangana.gov.inను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News