Wednesday, January 22, 2025

జూన్ 14 నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగాలకు సంబంధించి తుది దశకు చేరుకుంది. ఇటీవలనే ఎస్‌ఐ, ఎఎస్‌ఐ ఉద్యోగాలకు సంబంధించిన తుది రాతపరీక్షలతో పాటు కీ లను కూడా విడుదల చేసిన సంగతి విదితమే. అయితే తాజాగా రిక్రూట్‌మెంట్ బోర్డు మరో కీలక అప్డేట్ ఇచ్చింది. తుది రాత పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు సెంటర్ల వివరాలను పేర్కొంది.

తుది ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి వెబ్‌సైట్ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ లెటర్ల్లు జూన్ 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 8 గంట్ల వరకు https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని వివరించింది. ఆదిలాబాద్ యూనిట్ – ఎఆర్ హెడ్‌క్వార్టర్స్ గ్రౌండ్, ఎస్‌పి ఆఫీసు(4918), సైబరాబాద్ సిటిసి, సిపి ఆఫీసు, గచ్చిబౌలి (8,509), హైదరాబాద్ శివకుమార్ లాల్ పోలీసు స్టేడియం, గోషామహల్, హైదరాబాద్ (7459), కరీనంగర్ – పోలీసు హెడ్ క్వార్టర్స్, కరీంనగర్ (5,814), ఖమ్మం సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ (6,425), కొత్తగూడెం సిఇఆర్ క్లబ్, ప్రకాశం స్టేడియం (4000), మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసు,

సబ్ జైలు దగ్గర (7034), మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ (4896), నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీస్ (3865), గద్వాల్ డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు (4,967), నల్గొండ డార్మిటరీ హాల్, పోలీసు హెడ్‌క్వార్టర్స్ (7,480), నిజామాబాద్ – పోలీసు పరేడ్ గ్రౌండ్, సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ (5313), రాచకొండ సిఎఆర్ హెడ్ క్వార్టర్స్, అంబర్‌పేట్ (7737), రామగుండం సిపి ఆఫీసు (6341), సంగారెడ్డి – పోలీసు పరేడ్ గ్రౌండ్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ (7065), సిద్దిపేట – పోలీసు కమిషనరేట్ (4409), సూర్యాపేట – డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు (5968), వరంగల్ సిపి ఆఫీసు (7706) మంది అభ్యర్థులు మొత్తం 1,09,906 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

కావాల్సిన సర్టిఫికెట్లు : సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబధించి లెటర్ తప్పనిసరి. కుల ధ్రువీకరణపత్రం ఉండాలి. నాన్ క్రిమిలేయర్, ఈడబ్లూఎస్ అర్హత ఉన్నవారు తప్పసరిగా ఆయా పత్రాలను తీసుకురావాలి. ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్..పది, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు పిడిఎఫ్‌లో ఇచ్చిన వాటికి అనుగుణంగా పత్రాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. పలు పత్రాలపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News