Monday, December 23, 2024

జోరందుకున్నా సెస్ ఎన్నికల ప్రచారం

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) లోని 15 పాలక వర్గ సభ్యుల స్థానాలకు ఈ నెల 24న ఎన్నికలు నిర్వహిస్తుండగా (మంగళవారం) మంత్రి కెటిఆర్ బిఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం కోసం సిరిసిల్ల, వేములవాడ నియోజక వర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సెస్ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. సెస్ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి కెటిఆర్‌తో పాటుగా పవర్‌లూమ్ టెక్స్‌టైల్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, శాసన సభ్యులు చెన్నమనేని రమేష్‌బాబు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జడ్‌పి సిపి అరుణ, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్లు జిందం కళచక్రపాణి, రామతీర్థపు మాధవితో పాటుగా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ గుడ్ల మంజులతో పాటుగా కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

బిజెపి నుండి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ పార్టీ నాయకులు ఆవునూరు రమాకాంతరావు, రెడ్డబోయిన గోపి, రాణి రుద్రమదేవి, అన్నల్‌దాస్ వేణు తదితరులు ప్రచారం సాగిస్తుండగా, కాంగ్రెస్ పక్షాన మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ తదితరులు ప్రచారం సాగిస్తున్నారు.సిపిఐ నాయకులు బిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం సాగిస్తున్నారు. బిఎస్‌పి అభ్యర్థులను బరిలోకి దింపి ప్రచారం సాగిస్తోంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ నిర్వహించనున్న సెస్ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయావకాశాలు బిఆర్‌ఎస్‌కే ఎక్కువగా ఉన్నప్పటికీ సహకార సంఘం ఎన్నికలు కాబట్టి పార్టీ రహితంగా నిర్వహిస్తున్నందు వల్ల గుర్తుల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒకే పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు వివిధ మండలాల్లో వేరువేరు గుర్తులు రావడంతో ఎక్కడికక్కడ గుర్తులు వేరువేరుగా ప్రచారం చేయాల్సి రావడంతో నాయకులకు కొంత ఇబ్బందిగా మారింది.

సిరిసిల్ల టౌన్ 1లో మాత్రమే బిఆర్‌ఎస్ నుడి దిడ్డి రమాదేవి, బిజేపి నుండి మోర శైలజ ముఖాముఖి పోటి పడుతుండగా మిగిలిన 14 స్థానాల్లో బహుముఖ పోటీలు తప్పలేదు. టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తరువాత మొదటి సారిగా సెస్ ఎన్నికలలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని ఇద్దరు నాయకులను సస్పెండ్ చేసి బిఆర్‌ఎస్ చరిత్ర సృష్టించింది. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికల్లో పార్టీలు తమకు మద్దతు ప్రకటించలేదని అలిగి పలువురు నాయకులు తమ పార్టీలను వీడి మరో పార్టీలోకి చేరడం కూడా సెస్ ఎన్నికల్లో ఓ పరిణామం కావడం విశేషం.సెస్ ఎన్నికల్లో డైరెక్టర్ స్థానాలకు సెస్ మాజీ చైర్మన్లు, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు, అర్భన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, సెస్ మాజీ డైరెక్టర్లు కూడా కొత్తవారితో పోటీ పడుతున్నారు. ప్రచారంలో అభ్యర్థులు, వారి సమర్ధకులు అనేక అంశాలను ఉపయోగిస్తున్నారు.

పోటీ దారులలో కొందరి అవినీతి అక్రమాలను వివరించడంతో పాటుగా చేయబోయే అభివృధ్ధి గురించి హమీలు గుప్పిస్తున్నారు.
సెస్ సభ్యులు ఎవరిని ఆశీర్వదిస్తారో చూడాలి. ప్రస్తుత ఎన్నికల్లో సిరిసిల్ల టౌన్ 1 స్థానం నుండి దిడ్డి రమాదేవి ( బీరువా ), మోర శైలజ ( బ్యాటు ) గుర్తుతో పోటి పడుతున్నారు. సిరిసిల్ల టౌన్ 2 స్థానం నుండి ఆడెపు చక్రపాణి (బీరువా),కుసుమ విష్ణుప్రసాద్ (బ్యాటు), కూరపాటి శ్రీధర్ (బ్యాటరీలైటు),గుంటుక మహేష్ (బ్రష్), గుర్రం రాజలింగం(బకెట్), దార్నం లక్ష్మినారాయణ ( కొబ్బరికాయ ), నంది రమేష్(మంచము),బూర నాగరాజు ( కప్పుసాసర్), వెంగళ అశోక్ (డీజిల్ పంపు), ఆర్ సుభాష్ రావు ( గౌను )గుర్తులతో రంగంలో ఉన్నారు. తంగళ్లపల్లి నుండి చిక్కాల రామారావు (బీరువా),జలగం ప్రవీణ్‌కుమార్ (బ్యాటు), వరి బాబు (బ్యాటరీ లైట్ ), వెన్నమనేని శ్రీధర్ రావు (బ్రష్), శ్యాగ యాదగిరి (బకెట్ ) గుర్తులతో పోటీ పడుతున్నారు. ఇల్లంతకుంట నుండి ఏనుగుల లింగయ్య (బీరువా), భూంపెల్లి రాఘవరెడ్డి (బ్యాటు), మల్లుగారి రవీందర్ రెడ్డి(బ్యాటరీలైటు),మహ్మద్ జమాల్(బ్రష్), సింగరి శ్రీనివాస్ (బకెట్) గుర్తుతో బరిలో ఉన్నారు.

గంభీరావుపేటలో ఒరగంటి నర్సింలు(బీరువా), కొక్కు దేవేందర్ యాదవ్(బ్యాటు), గంట అశోక్ (బ్యాటరీలైటు), దమ్మ శ్రీనివాస్ (బ్రష్),నర్ర చిన్న లింగారెడ్డి (బకెట్), జి నారాయణ రావు(కొబ్బరికాయ), యల్ రాజేందర్ రెడ్డి(మంచం) గుర్తుతో బరిలో ఉన్నారు. ముస్తాబాద్ నుండి జక్కుల యాదగిరి(బీరువా), జోగెల్లి శ్రీనివాస్(బ్యాటు), వై బాల్‌రెడ్డి(బ్యాటరీలైటు),మట్ట వెంకటేశ్వర్ రెడ్డి(బ్రష్), సందుపట్ల అంజిరెడ్డి(బకెట్) గుర్తుతో పోటి పడుతున్నారు. ఎల్లారెడ్డిపేటలో గుండాటి వెంకట్ రెడ్డి(బీరువా),దొమ్మాటి నర్సయ్య(బ్యాటు), నిరతి బాలనర్సు(బ్యాటరీలైటు), వర్ష కృష్ణహరి( బ్రష్) గుర్తుతో బరిలో ఉన్నారు. వీర్నపెల్లి నుండి గుగులోతు హరిలాల్ (బీరువా), భూక్య సంతోష్(బ్యాటు),యం మల్లేశం(బ్యాటరీలైటు), లక్పతి మాలోతు(బ్రష్), లెంకల లక్ష్మణ్(బకెట్)గుర్తులతో బరిలో నిలిచారు.

చందుర్తి నుండి అల్లాడి రమేష్ (బీరువా),ఏనుగుల కనుకయ్య(బ్యాటు), కుమ్మరి చిరంజీవి(బ్యాటరీలైటు), శ్రీనివాసరావు పి (బ్రష్)గుర్తుతో రంగంలో ఉన్నారు. రుద్రంగిలో అక్కెనపల్లి నర్సింగరావు(బీరువా), అల్లాడి కృష్ణప్రసాద్ (బ్యాటు),అల్లూరి సంతోష్‌రెడ్డి(బ్యాటరీ లైటు), ఆకుల గంగారామ్(బ్రష్), ఎర్రం నర్సయ్య(బకెట్), పడాల గణేష్(కొబ్బరికాయ) గుర్తులతో బరిలో ఉన్నారు. కోనరావుపేటలో కేతిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి (బీరువా),గున్నాల లక్ష్మణ్ (బ్యాటు), గోపాడి సురేందర్ రావు(బ్యాటరీలైటు), జింక శ్రీనివాస్(బ్రష్), దేవరకొండ తిరుపతి(బకెట్), పల్లం సత్తయ్య(కొబ్బరికాయ), బండ సత్తయ్య (మంచం) గుర్తుతో రంగంలో ఉన్నారు. వేములవాడ టౌన్ 1 స్థానంలో అల్లాడి నళిని(బీరువా), నామాల ఉమ( బ్యాటు), బొజ్జ భారతి ( బ్యాటరీలైటు) గుర్తులతో పోటి పడుతున్నారు. వేములవాడ టౌన్ 2 స్థానంలో చొక్కాల రాములు ( బీరువా), నీలం గురువయ్య(బ్యాటు), పిలి కనుకయ్య(బ్యాటరీలైటు), బుర్ర శేఖర్ (బ్రష్), రేగులపాటి హరిచరణ్‌రావు(బకెట్) గుర్తులతో రంగంలో ఉన్నారు.

వేములవాడ రూరల్ స్థానంలో ఆకుల దేవరాజం(బీరువా),జక్కుల తిరుపతి(బ్యాటు), వకుళాభరణం శ్రీనివాస్ (బ్యాటరీలైటు) గుర్తులతో బరిలో ఉన్నారు. బోయినిపెల్లి స్థానంలో ఆంజనేయులు కట్కూరి(బీరువా), కొట్టెపల్లి సుధాకర్ (బ్యాటు), జోగు రవీందర్(బ్రష్),బొలుమాల శంకరయ్య( బ్రష్) గుర్తులతో పోటిలో ఉన్నారు. సెస్ పాలక వర్గ స్థానాలకు ఈ నెల 24న ప్రత్యక్ష పద్దతిన ఎన్నికలు నిర్వహించి, ఈ నెల 26న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. 27న సెస్‌కు నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. మరో రెండు రోజుల్లో సెస్ అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. అదృష్టవంతులు, దురదృష్టవంతులెవరో ఈ నెల 26న తేలిపోతుంది. ఆ తరువాత 27న వ్యూహ ప్రతి వ్యూహల మధ్య చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరవుతారో తెలిసిపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News