Monday, January 20, 2025

చబహార్ రేవు మొత్తం ప్రాంతానికి లాభదాయకం

- Advertisement -
- Advertisement -

ఆ విషయమై సంకుచిత దృక్పథం తగదు
యుఎస్ హెచ్చరికపై జైశంకర్

కోల్‌కతా : చబహార్ రేవు ఈ మొత్తం ప్రాంతానికి ప్రయోజనకరంగా ఉంటుందని, ఆ విషయమై సంకుచిత దృక్పథం తగదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సూచించారు. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు పెట్టుకునే ఏ దేశమైనా ‘ఆంక్షల ముప్పు ఎదుర్కొనవలసి రావచ్చు’ అని అమెరికా హెచ్చరించిన తరువాత జైశంకర్ ఆ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ఒక కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, చబహార్ రేవు విస్తృత ప్రయోజనకరం అని గతంలో తుదకు యుఎస్ కూడా అంగీకరించిందని గుర్తు చేశారు.

ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక చబహార్ రేవు నిర్వహణకు పది సంవత్సరాల కాంట్రాక్ట్‌పై భారత్ సోమవారం సంతకాలు చేసింది. మధ్య ఆసియాతో భారత్ వాణిజ్యం విస్తరణకు ఆ రేవు తోడ్పడుతుంది. ‘మాకు చబహార్ రేవుతో సుదీర్ఘ అనుబంధం ఉంది. కాని మేము ఎన్నడూ దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకాలు చేయలేదు. వివిధ సమస్యలు ఉండడమే అందుకు కారణం& ఎట్టకేలకు మేము వాటిని పరిష్కరించగలిగాం. దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోగలిగాం. దీర్ఘకాలిక ఒప్పందం లేకపోతే మేము రేవు కార్యకలాపాలను మెరుగుపరచలేం కనుక ఆ ఒప్పందం అవసరం.

రేవు కార్యకలాపాలు మొత్తం ప్రాంతానికి ప్రయోజనకరం అని మేము విశ్వసిస్తున్నాం’ అని జైశంకర్ తెలియజేశారు. ‘నేను కొన్ని వ్యాఖ్యలు చూశాను. అయితే, వాస్తవానికి ఇది ప్రతి ఒక్కరికీ లాభదాయకం అని జనానికి అవగాహన కలిగించడం ముఖ్యమని నా భావన. జనం దీనిపై సంకుచిత భావన కలిగి ఉండరని అనుకుంటా. వారు గతంలో అలా చేయలేదు’ అని ఆయన చెప్పారు. ‘గతంలో చబహార్‌పై యుఎస్ దృక్పథాన్ని చూసినట్లయితే, చబహార్‌కు విస్తృత ప్రాముఖ్యం కలిగినదని యుఎస్ అంగీకరించింది. మేము ఆ విషయంలో ముందుకు సాగుతాం’ అని జైశంకర్ చెపాపరు.

ఇంధన సంపన్న ఇరాన్ దక్షిణ తీరంలో సిస్టాన్ బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో ఒమన్ సింధు శాఖలో న్న చబహార్ రేవును అభివృద్ధి చేయాలని భారత్ 2003లోనే ప్రతిపాదించింది. పాకిస్తాన్‌ను తప్పించి అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా నడవా (ఐఎన్‌ఎస్‌టిసి)గా పేర్కొనే రోడ్, రైల్ ప్రాజెక్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌ను, మధ్య ఆసియాను చేరడానికి భారతీయ సరకులకు ఆ రేవు ఒక గేట్‌వేగా ఉంటుంది. ఇరాన్ అనుమానిత అణుశక్తి కార్యక్రమం దృష్టా ఆ దేశంపై యుఎస్ ఆంక్షల వల్ల రేవు అభివృద్ధి ప్రక్రియ మందగించింది. దీర్ఘకాలిక ఒప్పందంపై భారత్ పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపిజిఎల్), ఇరాన్ రేవు, సాగరప్రాంత సంస్థ (పిఎంఒఐ) సంతకాలు చేశాయని అధికార ప్రకటన తెలియజేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News