- Advertisement -
అమెరికా సిఆర్‌ఎస్ నివేదిక
వాషింగ్టన్: భారత్ సాయంతో ఇరాన్ చేపట్టిన ఛాబహార్ ఓడరేవు ఈ ఏడాది మే నుంచి పని చేయడం ప్రారంభిస్తుందని అమెరికాకు చెందిన కాంగ్రెసియనల్ రీసెర్చ్ సర్వీస్(సిఆర్‌ఎస్) నివేదిక వెల్లడించింది. 2021 ప్రారంభం నుంచి ఓడరేవు నిర్మాణ పనులను భారత్ వేగవంతం చేసిందని సిఆర్‌ఎస్ నివేదిక పేర్కొన్నది. ట్రంప్ హయాంలో ఇరాన్‌పై ఆంక్షల కారణంగా ఓడరేవు పనులు మందగించాయి. ఈ నివేదికను అమెరికా కాంగ్రెస్‌కు సిఆర్‌ఎస్ సమర్పిస్తుంది. ఛాబహార్ ఓడరేవు కోసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడికి సంబంధించిన ఒప్పందంపై 2016లో ఇరాన్‌ను సందర్శించిన సందర్భంగా ప్రధాని మోడీ సంతకం చేశారు. దక్షిణాసియా దేశాలతో వాణిజ్యానికి ఈ ఓడరేవు భారత్‌కు ఉపయోగపడుతుంది. పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్థాన్ ద్వారా ఈ ఓడరేవును భారత్ వినియోగించుకునే వీలున్నది.
- Advertisement -