Wednesday, January 22, 2025

పల్లె ప్రజల తో మమేకమైన మాజీ ఎమ్మెల్యే చాడ

- Advertisement -
- Advertisement -

ఎల్కతుర్తి:- ఎల్కతుర్తి మండలంలోని దామెర చింతలపల్లి ఇందిరానగర్ జిలుగుల జగన్నాథ్ పూర్ గ్రామాలలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సందర్శించిన పల్లె ప్రజల తోటి మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకొని ముచ్చటించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి .

గ్రామ ప్రజలు సమస్యల వలయంలో బతుకునుడుస్తున్నారని ఇంకా పూర్తికాని పనులు ఎన్నో ఉన్నాయి అని వృద్ధాప్య పింఛను, రేషన్ కార్డు, రాని కొంతమంది మహిళలు వీధిలైట్లు, స్ట్రీట్ రోడ్లు కావాలని అడుగుతున్న వారు కూడా ఇంకా పల్లెలో ఉండడం చాలా బాధ కలిగిస్తుందని తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమస్యలను దృష్టి సారించి పరిష్కరించాలని ప్రతి గ్రామంలో ఇప్పటికీ ఇల్లు లేని బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రతి గ్రామంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అందుకే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటం నిర్వహిస్తున్నదని ఈ సమస్యలపై వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆదర్ శ్రీనివాస్, సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు రాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కార్రే లక్ష్మణ్, నిమ్మల మనోహర్, జిల్లా సమితి సభ్యులు మర్రి శ్రీనివాస్, కామర వెంకట్, మర్రి విజయ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాష బోయిన సంతోష్, కంచర్ల సదానందం, ఆరెపల్లి తిరుమల, సూర మొగిలి ముచ్ఛ తిరుపతి రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News