Monday, November 18, 2024

బిజెపి నాయకులుగా వ్యవహరిస్తున్న గవర్నర్: చాడ వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ గవర్నర్‌గా కాకుండా ఓ బిజెపి పార్టీ నాయకులుగా వ్యవహరిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి శనివారం విమర్శించారు. శుక్రవారం బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ ఇంటిపై జరిగిన దాడి విషయంలో.. అది కూడా తమకు సంబంధం లేని విషయంలో గవర్నర్ వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. పశ్చిమబెంగాల్, కేరళ, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో గవర్నర్‌ను ఉపయోగించి బిజెపి రాజకీయం చేస్తున్నదన్నారు.

అదే తరుహా రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో మొదలు పెట్టారని వాపోయారు. సమస్యను పరిష్కరించాలి తప్ప కక్ష పూరితంగా వ్యవహరించడం గవర్నర్ కు తగదని అలాంటి వ్యవస్థ రద్దు చేయాలని సిపిఐ జాతీయ మహా సభలు ఇప్పటికే పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నామన్నారు.ఆ తరహాలో రానున్న కాలంలో గవర్నర్ వ్యవస్థ రద్దుకై ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 7వ తేదీన చలో రాజ్ భవన్ పిలుపు నివ్వడం జరిగిందని చాడా గుర్తు చేశారు.

ఇప్పటికే నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం సిబిఐ. ఐటి దాడులు కేవలం ప్రతిపక్షాలపైనే చేస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కేంద్రం రాష్ట్రాలకు సహాయకారిగా ఉండి దేశ సమగ్రత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. ఇదే విషయం సర్కారియా కమిషన్ కూడా చెప్పిందని అన్నారు. కానీ బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలపై పెత్తనం చేస్తుందని అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. బిజెపి మతోన్మాద ఫాసిస్టు విధానాలను ఎండగట్టేందుకు కలిసి వచ్చే ప్రగతిశీల లౌకిక, ప్రజాతంత్ర వామపక్ష శక్తులతో కలిసి పోరాడుతామన్నారు.

Chada Venkat Reddy slams Governor Tamilisai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News