Saturday, December 21, 2024

సిఎం కెసిఆర్‌కు చాడ వెంకట రెడ్డి లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరుతూ సిఎం కెసిఆర్‌కు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి శనివారం లేఖ రాశారు. గత 20 సంవత్సరాలకు పైబడి తక్కువ వేతనాలతోనే రెగ్యూలర్ ఎంప్లాయిస్‌తో సమానంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాల నుండి క్రమబద్దీకరించాలని కోరుతున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టూరిజం కార్పోరేషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్దీకరణ చేస్తామని హామీ ఇచ్చిందని .. ఇప్పటికీ క్రమబద్దీకరణ చేపట్టకపోవడంతో ఉద్యోగులు నిరుత్సాహంతో వున్నారన్నారు. తెలంగాణ విభజన జరిగిన తరువాత తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌కు 941 పోస్టులను కేటాయించగా.. కాంట్రాక్టు పద్ధతిలో 183 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. కావున తెలంగాణ టూరిజం కార్పోరేషన్‌లో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న 183 మంది ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News