ఓ అపార్ట్‌మెంట్‌లో కొందరు చిన్న పిల్లలు కలిసి ఫుట్ బాల్ ఆడుతుంటారు. అంతలో వారి దగ్గరు వారి ఫ్రెండ్ వస్తుంది. ఈ మమ్మీలంతా ఎప్పుడూ చదువు చదువనే అంటుంటారు. పాట గీటా టైమ్ వేస్ట్ అంటారు. అంటూ ఇప్పటి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారనే విషయాన్ని పాట రూపంలో చక్కగా పాడింది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎప్పుడూ చదువుకోకుండా అప్పుడప్పుడు ఆట పాటలను నేర్చుకోవాలనుని ఎందుకు చెబుతుందనే విషయం తెలియాలంటే మే 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాత పాపారావు బియ్యాల. ఈ సినిమాను హిందీలో పి.వి.ఆర్, తెలుగులో ఎస్.వి.సి బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.


కిరన్ డియోహన్స్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన ఈ చిత్రానికి అద్భుతమైన డాన్సులను కంపోజ్ చేశారు ఆడమ్ ముర్రు, చిన్ని ప్రకాష్, రాజు సుందరం. ఓజూ బారువా, గ్రేసీ గోస్వామి కీలక పాత్రల్లో నటించారు. ఇంకా బెంజిమిన్ జిలాని, సుహాసిని మౌలే, మోన, లీలా సామ్‌సన్స్, బగ్స్ భార్గవ, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వకార్ షేక్, ఫణి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
- Advertisement -