Monday, December 23, 2024

స్కిల్ స్కామ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

విజయవాడ: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు  చేసి విజయవాడ ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. ప్రస్తుతం ఎసిబి కోర్టులో ఇరు వర్గాల వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపించగా, సిఐడి తరఫున అదనపు ఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా తన లాయర్ తోపాటు చంద్రబాబు కోర్టుకు నివేదించుకున్నారు. “రాష్ట్రంలో పూర్తిగా కక్షసాధింపు పాలన కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై అధికార జులుం ప్రదర్శిస్తున్నారు.

రాష్ట్రంలో ఎక్కడా చట్టబద్ధమైన పాలన జరగట్లేదు. రాష్ట్రంలో పౌర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. గవర్నర్ అనుమతి లేకుండానే నన్ను అరెస్టు చేశారు. స్కిల్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. స్కిల్ డెవలప్ మెంట్ కు 2015-16 బడ్జెట్ లో పొందుపర్చాం. రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమెదించింది. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు. 2021 డిసెంబర్ 9 నాటి ఎఫ్ఆర్ఐలో నా పేరు లేదు. అప్పటి రిమాండ్ రిపోర్టులోనూ నా పాత్ర ఉందని సిఐడి పేర్కొనలేదు. రాజకీయ కక్షతోనే నన్ను అరెస్టు చేశారు” అని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News