Monday, January 20, 2025

బాలికపై మేనమామ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అమరావతి: బాలికపై దగ్గరి బంధువు మేనమామ అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నిడదవోలు మండలంలో ఓ వసతి గృహంలో ఉంటూ ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక తల్లిదండ్రుల మధ్య విభేదాలు రావడంతో వేరుగా ఉంటున్నారు. బాలిక తల్లి జీవనోపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటుండగా బాలిక తన అమ్మమ్మ దగ్గర ఉంటుంది.

బాలికకు ఆధార్ కార్డులో మార్పులు చేయాల్సి ఉండడంతో వృద్ధురాలు తన దగ్గరి బంధువు కమల్‌ను వంద రూపాయలు ఇచ్చి ఆమెను ఆధార్‌కార్డు సెంటర్ దగ్గర తీసుకెళ్లమని చెప్పింది. కమల్ బాలికను వసతి గృహం నుంచి తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. అనంతరం బాలికకు కడుపు నొప్పి ఎక్కువగా రావడంతో అమ్మమ్మకు జరిగిన విషయం చెప్పాడు. దీంతో విషయం బాలిక తండ్రికి తెలియడంతో స్థానిక పిఎస్‌లో ఫిర్యాదు చేసి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News