టీం ఇండియా స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న అతను తాజాగా ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో స్నేహితురాలి మహ్‌వశ్‌తో కనపడి మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే తాజాగా చాహల్ మరో ఆసక్తికర పోస్ట్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీల ఈ ఎడిషన్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఈ సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో చాహల్‌ను పంజాబ్ కింగ్స్ జట్టు రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే చాహల్ ఈ సీజన్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఈ ప్రాక్టీస్‌లో బ్యాటింగ్ చేసిన చాహల్.. ఆ వీడియోని తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ‘ఓపెనింగ్‌కి ఇంకో స్థానం ఖాళీగా ఉందా.. నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ జట్టు ప్రధాన కోచ్ రిక్కీ పాంటింగ్ అడుగుతూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోలో చాహల్ ‘ఎస్ ఇట్స్ టూ’ అంటూ వీడియోలో అంటూ పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌ని ఇమిటేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.