Sunday, January 5, 2025

ఐపిఎల్‌లో చాహల్ నయా రికార్డు..

- Advertisement -
- Advertisement -

గౌహతి: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజువేంద్ర చాహల్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా చాహల్ నిలిచాడు. ఇప్పటివరకు శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ పేరిట ఉన్న 170 వికెట్ల రికార్డును చాహల్ బద్దలు కొట్టాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్ ఈ రికార్డును సాధించాడు. ఇప్పటి వరకు ఐపిఎల్‌లో 133 మ్యాచ్‌లు ఆడిన చాహల్ 21.58 సగటుతో 170కి పైగా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇటీవలే టి20 ఫార్మాట్‌లో 300 వికెట్లను పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా చాహల్ చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో 265 టి20 మ్యాచ్‌లు ఆడిన చాహల్ 23.60 సగటుతో 303 వికెట్లు తీశాడు. ఇదిలావుంటే ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో ఉన్నాడు. బ్రావో ఐపిఎల్ కెరీర్‌లో 183 వికెట్లు పడగొట్టాడు. అతని రికార్డును చాహల్ త్వరలోనే బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News