Monday, December 23, 2024

టి20క్రికెట్లో అరుదైన రికార్డు… చాహల్ @300

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా స్పిన్నర్ యుజ్వేద్ర చాహల్ టి20క్రికెట్లో అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. పొట్టి క్రికెట్లో 300వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరగిన మ్యాచ్‌లో చాహల్ ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, అదిల్ రషీద్‌తోపాటు హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్‌కుమార్ వికెట్లను పడగొట్టి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 265మ్యాచ్‌లో చాహల్ 303వికెట్లు పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్‌లో చాహల్ ఉత్తమ గణాంకాలు కాగా ఐపిఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలరుగా చాహల్ నిలిచాడు. 132మ్యాచ్‌ల్లో 170వికెట్లు తీసి లసిత్ మలింగ సరసన నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News