టీం ఇండియా స్టార్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్, తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు ఈ జంట సిద్ధమయ్యారు. అయితే ఈ విడాకుల నేపథ్యంలో ధనశ్రీకి.. చాహల్ ఎంత భరణం చెల్లిస్తున్నాడనే చర్చ సోషల్‌మీడియాలో జరిగింది. కొందరు చాహల్ 100 కోట్లు ఇస్తున్నాడని.. మరికొందరు అసలు ఏమీ ఇవ్వడం లేదని.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు కామెంట్లు చేశారు.
అయితే చాహల్.. ధనశ్రీకి ఎంత భరణం ఇస్తున్నాడో ఎట్టకేలకు బయటపడింది. చాహల్ రూ.4.75 కోట్లు భరణంగా చెల్లించేందుకు అంగీకరం తెలిపాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించి రూ.2 కోట్ల 37 లక్షల యాభై వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. మిగితా మొత్తం కూడా చాహల్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పిటిషనర్ల మధ్య ఎలాంటి వివాదానికి తావు లేదు. దీంతో విడాకుల మంజూరు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా.. హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించినట్లు తెలుస్తోంది.