Sunday, December 22, 2024

చైన్‌స్నాచర్ అరెస్టు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఒంటిరిగా ఉంటున్న వృద్ధురాలి మెడలోని బంగారు చైన్‌ను దొంగిలించిన యువకుడిని బోయిన్‌పల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి బంగారు చైన్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….సికింద్రాబాద్, న్యూబోయిన్‌పల్లికి చెందిన కొప్పుల అఖిలేష్ అలియాస్ అఖిల్ బజాజ్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. గతంలో చాలా ఉద్యోగాలు చేసిన అఖిల్ కొంత డబ్బులు రాగానే ఉద్యోగం మానేసేవాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో తిరుగుతుండడంతో వ్యసనాలకు బానిసగా మారాడు. మూడు నెలల క్రితం బజాజ్ ఫైనాన్స్‌లో చేస్తున్న ఉద్యోగం నుంచి తప్పుకున్నాడు.

Also Read: విడాకులకు నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించరాదు

అప్పటి నుంచి వ్యసనాలకు డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. స్నేహితులతో కలిసి సిగరేట్, గుట్కా, మద్యంతాగుతూ తిరుగుతుండేవాడు. ఈ క్రమంలోనే గణేష్ పాన్ షాప్ వద్ద రాత్రి సమయంలో సిగరేట్లు కొనుగోలు చేసేవాడు. ఈ సమయంలోనే సిగరేట్లు విక్రయించే వృద్ధురాలు మెడలో బంగారు చైన్ ఉండడం గమనించాడు, అంతేకాకుండా వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్నట్లు గమనించాడు. రాత్రి సమయంలో వచ్చి వృద్ధురాలి మెడలోని బంగారు చైన్‌ను చోరీ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బోయిన్‌పల్లి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News